అక్క పెళ్లిలో అకీరా సందడి…
1 min read
AAB NEWS : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి రోజు రానే వచ్చింది. ఇండస్ట్రీలోని ప్రముఖులకు స్పెషల్ ఇన్విటేషన్ అందడంతో ఛలో మంటూ ఉదయ్‌పూర్ వెళ్లారు పెళ్లి వేడుకల్లో సందడి చేయడానికి. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో సరదాగా సాగుతున్న సెలబ్రేషన్స్‌లో మంగళవారం సాయింత్రం పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా తళుక్కున మెరిశారు. పవన్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
నిహారిక-చైతన్యలకు అభినందనలు తెలిపిన అనంతరం పవన్-అకీరాలు చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అకీరా అచ్చం నాన్నలా ఫోటోకి ఫోజు ఇవ్వడంతో ఫ్యాన్స్‌ని ఆకర్షించాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు లైక్ ఫాదర్ లైక్ సన్ అని కామెంట్లు పెడుతున్నారు. వేడుకల్లో భాగంగా చిరు, బన్నీ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.
42 Total Views, 2 Views Today