AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉరవకొండ స్థానిక R&B గెస్ట్ హౌస్ లో…

1 min read

AABNEWS : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉరవకొండ స్థానిక R&B గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమంలో ఆసాది ప్రతాప్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం గాలికొదిలేసి ఓట్ల కోసం సీట్ల కోసం నవరత్నాల మోజులో పడి విద్యార్థులకు స్పష్టత లేని చదువులు చెప్పించడం జరుగుతోంది.ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు గాని ఉపాధ్యాయులకు గాని ఎటువంటి స్పష్టత లేకపోవడం బాధాకరమైన టువంటి విషయం అదేవిధంగా నవరత్నాల మోజులో రాజన్న రాజ్యం తెస్తాం. అని వారి తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడవడం ఇదేనా రాజన్న రాజ్యం అని ఎద్దువా చేశారు.ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యాలు ఆడుకుంటుంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఉన్నత విద్యాధికారులు చూసి చూడనట్టు కళ్ళు ఉన్న కబోదిలా కాకుండా ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు ఒకసారి ఆలోచించండి విద్యార్థులకు తగిన న్యాయం చేస్తారని అదేవిధంగా యూనివర్సిటీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావుల యొక్క నిలయాలుగా చేయాలని VC రాజకీయ నాయకుల భజనలు కు స్వస్తి చెప్పి విద్యార్థులు యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని హెచ్చరిస్తోంది.ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు ఉరవకొండ కన్వీనర్ రేగటి శివ కృష్ణ మరియు కిరణ్.వంశీ నాయుడు.గిరిబాబు.ఈరన్న తదితర విద్యార్థులు పాల్గొన్నారు

 257 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.