అపత్రమతతో విధులు నిర్వర్తించాలి
1 min read
AAB news:07.12.2020
బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ బ్యూరో
పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ములుగు ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి ఎస్పి, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు. సోమవారం మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ప్రతి రికార్డును తనిఖీ నిర్వహించి, ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు ప్రతి కేసుకు సంబంధించిన పూర్వాపరాలు అన్ని పరిశీలించి రికార్డులన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల గురించి స్థానిక ఎస్ఐ అనిల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించి, పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది, కీర్తిప్రతిష్టలు పెంచే విధంగా పనిచేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రజల భాగస్వామ్యంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. PLGA వారోత్సవాల నేపథ్యంలో మరింత అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘాతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలపై డేగ కన్ను వేయాలన్నారు. అలాగే మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ అన్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీస్ అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి బోనాల కిషన్, మహాదేవపూర్ సిఐ నరసయ్య, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు, SI అనిల్, సిసి ఫసియొద్దిన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
18 Total Views, 2 Views Today