AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమరావతిని అంధకారంలోకి నెట్టిన వైసీపీ…

1 min read

AAB NEWS : అమరావతి: ప్రజా రాజధాని అమరావతిని వైసీపీ అంధకారంలోకి నెట్టిందని మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి మండపడ్డారు. రాజధాని మార్చబోమని ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లేయించుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు విశాఖలో వేలాది ఎకరాల భూములు కొన్నారని అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారం నాటికి 363వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

 50 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.