AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ బెజోస్.. తర్వాత ఎవరంటే?

1 min read

ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన తర్వాత ఆండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు. సీఈవో పదవి నుంచి

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తన పదవి నుంచి తప్పుకుంటున్నారు. అయితే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మాత్రం కొనసాగుతారు. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో(జులై-సెప్టెంబర్) ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. క్లౌడ్ డివిజన్ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తున్న ఆండీ జాస్సీ.. బెజోస్ తర్వాత సీఈవో కానున్నారు.

అమెజాన్ త్రైమాసిక అమ్మకాలు మొదటిసారి 100 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7.2 లక్షల కోట్లు) దాటాయని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటన చేసినప్పుడే సీఈవో మార్పు గురించి కూడా తెలిపింది. అమెజాన్ కంపెనీ 27 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ బుక్‌సెల్లర్‌గా తన ప్రస్థానం ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. అమెజాన్ కంపెనీని స్థాపించింది ప్రస్తుత సీఈవో జెఫ్ బెజోసే.

 78 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.