అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాన్ని అందజేసిన…
1 min read
AABNEWS : అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాన్ని అందజేసిన డా.పాల్వాయి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అయోధ్య రామాలయ నిర్మాణార్థం రూ.1,00,116/- (లక్షా నూట పదహారు) విరాళం ఇచ్చిన డా.పాల్వాయి హరీష్ బాబు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాల్వాయి రాజ్యలక్ష్మి గారు. ఈ సందర్భంగా డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ గత తరాలకు రాని అదృష్టం మన తరానికి వచ్చినందున రామాలయ నిర్మాణం లో మనం భాగస్వాములవడం గొప్ప విషయం అని తెలిపారు. కొమరంభీం కాగజ్ నగర్: ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: డా.కొత్తపల్లి శ్రీనివాస్, RSS ప్రచారక్ శ్రీ కృష్ణ భాస్కర్, శ్రీ తిరుమల్ జి, లెక్కల మురళి, హన్మంతరావు, అల్లాడి రాజు, డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరివెంకటేశ్, RSS బాధ్యులు శ్రీ పోతరాజుల లక్ష్మణ్, భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు శివ గౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
88 Total Views, 2 Views Today