AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు…

1 min read

AABNEWS : అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా జరిమానా మరియు శిక్ష వేయవచ్చు. అరెస్ట్ చేసిన క్షణం నుండి కోర్ట్ లో ప్రవేశ పెట్టె దాకా మీ పూర్తి బాధ్యత రక్షణ ఒక వేళ మీకు ఏమి జరిగిన పూర్తి బాధ్యత పోలీస్ వారిదే అందుకే అరెస్ట్ చేసే సమయం లొనే మెమో ఆప్ అరెస్ట్ ( పేపర్ ) రాపించాలి CRPC SECTION 41 B, C, D ప్రకారం పేపర్ మీద రాయామని అని అడగాలి ఎలా అంటే నేను పలానా పోలీస్ అధికారిని పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్ట్ చేస్తున్నను అని అధికారి పేరు అతని ర్యాంక్ కానిస్టేబుల్ ఏస్ఐ etc.. తేదీ స్థలం ఏ స్టేషన్ కింద అరెస్ట్ జరుగుతుంది ఆ సమయంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అతనికి ఎమైన స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా అతని దగ్గర వుండే వస్తువులు మొత్తం పేపర్ లో రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులు లేదా సమాజం లో మంచి పేరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్ట్ చేసే పోలీస్ అధికారి సంతకం, అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క సంతకం కూడా కచ్చితంగా పేపర్ లో రాయాలి దీన్నే మేమో అప్ అరెస్ట్ అంటారు అరెస్ట్ చేసిన 24 గంటల లోపే మెజిస్ట్రేట్ లేదా కోర్ట్ లో కచ్చితంగా ప్రవేశ పెట్టాలి .ఏ పోలీసు అయినా మిమ్మల్ని స్టేషన్ కి రండి అని ఫోన్ చేస్తే ముందు ఆ అధికారికి ఇలా అడగండి Crpc సెక్షన్ 169,170,50 ల ప్రకారం నోటీసులు సర్వ్ చేయవలెని వినయంగా కోరుచున్నాను అని చెప్పండి లేదా వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్ కు మెసేజ్ చెయ్యండి.వివిధ హైకోర్టులలో అరెస్టు సమయంలో సంబంధిత పోలీసు అధికారులు కోట్టడం జరిగింది. వారి మీద రిట్స్ వేయడం జరిగింది. వివిధ కోర్టులు శిక్ష వేయడం జరిగింది. ఈ నిబంధన న్యాయాన్యాలతో సంబంధం లేకుండా పోలీసు వ్యవస్థ దుందుడుకు చర్యల్ని నిలువరించడానికి భారతీయులు అందరికీ రాజ్యాంగం ద్వారా dr BR అంబెడ్కర్ గారు అందించిన మహత్తర కానుక…. ఎవ్వరూ భయపడకుండా వ్యవహరించండి…. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం…. సత్యమేవ జయతే…. న్యాయాన్ని రక్షించుకుందాం…. ధర్మాన్ని కాపాడితే…. ఆ…. ధర్మమే మనల్ని కాపాడుతుంది…..
సదా మీ సేవలో…
హెచ్ఆర్సీ ప్రొటెక్షన్ చైర్మన్ “అబ్దుల్ మునాఫ్

 484 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.