AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అల్లోపతి వైద్యుల మీద దుష్ప్రచారంపై సమన్లు…

1 min read

AAB NEWS: యోగా గురు బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. అల్లోపతి వైద్యం, వైద్యుల మీద దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై సమన్లు జారీ చేసింది. కేసును కోర్టు వచ్చే నెల 10న విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు అల్లోపతి ఔషధాల వల్ల లక్షలాది మంది కరోనా పేషెంట్లు చనిపోయారని బాబా రాందేవ్ అన్నారు.ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు ఆ వ్యాఖ్యలను ఆక్షేపించారు. పరువునష్టం నోటీసులిచ్చారు. క్షమాపణలు చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లను రాందేవ్ నుంచి రాబడతామని హెచ్చరించారు. విషయంలో జోక్యం చేసుకున్న అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందిగా రాందేవ్ కు సూచించారు. దీంతో రాందేవ్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తర్వాత కూడా ఐఎంఏ పాట్నా, రాయ్ పూర్ సహా వివిధ ప్రాంతాల్లో రాందేవ్ పై కేసులు పెట్టింది.

 124 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.