AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అసంపూర్తి ప్రధాన పుష్కరఘాట్ రహదారితో వాహన భక్తులకు తప్పని ఇక్కట్లు.

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

కాళేశ్వరం:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మహాదేవపూర్ మండలం. పవిత్ర త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం. అంతర్ రాష్ట్రాలకు సమీపంలో ఆని ఉన్న ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సుదూర దర్శన భక్తులకు అనుకూలమైన దేవాలయాలు భక్తుల కోరికలకు సరిపడా సకల దేవతా మూర్తులు ఉన్నటువంటి ప్రాముఖ్యత గల క్షేత్రం. కార్తీక మాసం చివరి రోజులు సమీపిస్తుండడంతో, దర్శనాలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. కార్తీక మాసం చివరి శనివారం శని త్రయోదశి కావడంతో, అధిక వాహనాలు రావడంతో, కాళేశ్వరం లోని బస్ స్టాండ్ ఆవరణ నుండి, నది తీరం వరకు ప్రధాన పుష్కర ఘాట్ ఆలయ అనుబంధ రహదారి కావడంతో, సాధారణ నడిచి వెళ్లే భక్తులకు, వాహనాల రాకపోకల భక్తులకు, పాఠశాల ఆవరణ నుండి బస్టాండ్ వరకు, అసంపూర్తి రహదారి కావడంతో, భక్తులు దర్శించు కొనుటకు ముచ్చెమటలు పట్టాయి. ఇటు వాహన రాకపోకలు అధిక భక్తుల రద్దీ కావడంతో కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులకు పిల్లలతో ప్రధాన రోడ్డు మార్గం నడవాలంటే జంకు కొని కొంతమంది రద్దీ తగ్గేవరకు వేచి చూశారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వర క్షేత్రానికి గతంలో 25 కోట్ల రూపాయలు కేటాయిస్తే, అతి ముఖ్యమైన మెయిన్ పుష్కర ఘాట్ రహదారిని కొంతమంది నాయకుల కోసం, అభివృద్ధిని కుంటూ పడేశారని స్థానికుల విమర్శ. కావున ఇట్టి సమస్యలు సంబంధిత అధికారులు కారు ముఖ్యనాయకులు పునరాలోచించి స్థానిక ఇతర భక్తులకు సౌకర్యవంతమైన అరవై ఆరు ఫీట్ల వెడల్పు, అసంపూర్తి మెయిన్ రహదారిని పూర్తి చేయించి సౌకర్యాలు కల్పించాలని సుదూర భక్తులు స్థానికులు కోరుతున్నారు.

 60 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.