September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆంధ్రప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి  శ్రీ చదలవాడ ఉమేశ్ చంద్ర గారి జయంతి వారోత్సవాల సందర్బంగా….

1 min read

AABNEWS : పోలీస్ స్టేషన్ నందు సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ టౌన్ సిఐ టి. సుబ్రమణ్యం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి శ్రీ చదలవాడ ఉమేశ్ చంద్రగారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు.వారిని స్మరించుకున్నారు. 
ప్రతి పోలీసు, అధికారులకు ఆదర్శప్రాయుడు దివంగత ఉమేష్‌చంద్ర అని డోన్ టౌన్ సి ఐ టి సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మంచి క్రమశిక్షణ కలిగిన అధికారిగా ఉమేశ్ చంద్ర పేరు తెచ్చుకున్నారు. దుర్మార్గుల తూటాలకు బలైన ఉమేష్ చంద్ర తెలుగు ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచియున్నారని డోన్ టౌన్ సిఐ టి సుబ్రమణ్యం కొనియాడారు. అలాగే ప్రతి పోలీస్ గుండె లో ఆయన చెరగని ముద్రగా నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ గోపాల్ ,ఏ ఎస్ ఐ భాస్కర్, హెచ్ సి నాయక్, హెచ్ సి రామ్మోహన్ ,పి సి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డోన్ టౌన్ సిఐ టి. సుబ్రమణ్యం
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి లు మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ టౌన్ సిఐ టి. సుబ్రమణ్యం, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
శ్రీ ఉమేశ్చంద్ర  మార్చి ,1966  న గుంటూరు  జిల్లా పెదపూడి (అమృతలూరుమండలం) 
గ్రామములో జన్మించారు. తండ్రి హైదరాబాదు ఆల్విన్ సంస్థలోఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ 
పాఠశాలలో చదివిన పిదప నిజాం కళాశాల నుండి బి.ఎ. (1987) మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి యం.ఎ. (1989) పట్టాలు పొందారు. రెండింటిలోను ప్రథముడిగా నిలిచి బంగారు పతకాలు సాధించారు.
1991లో ‘భారత పోలీస్ సేవ’ లో ఎన్నికై, ‘జాతీయ పోలీస్ అకాడెమీ’ లో శిక్షణ పొందారు. 
1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. “జన జాగృతి” కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. 1994అక్టోబరులో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నారు. ఫిబ్రవరి 1995 లో వరంగల్లు తిరిగివచ్చి ‘ప్రత్యేక విధుల అధికారి’ గా నేరస్థులను అరికట్టారు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగివచ్చారు. 
జూన్ 1997 నుండి ఏప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి “కడప పులి” అను పేరు తెచ్చుకున్నా
ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న దుర్మార్గుల తూటాలకు బలైనారు.సెప్టెంబరు 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పారు. సమాజానికి సేవ చేసిన మహనీయులను అనుక్షణం స్మరించుకుంటూ  వారి అడుగుజాడల్లో నడుస్తూ  సమాజానికి సేవ చేయాలని డోన్ టౌన్ సిఐ టి.సుబ్రమణ్యం
సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి కోరారు. అలాగే డోన్ టౌన్ సిఐ టి. సుబ్రమణ్యం,
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి లు ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, ప్రజలంతా
కరోనా జాగ్రత్తలు పాటించాలని చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ,తుమ్మినప్పుడు దగ్గినప్పు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని ,నీళ్ళు శరీరాని తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాల లో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాల లో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని  తెలిపారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. దినచర్యలో యోగా, వ్యాయామాలు, ధ్యానం చేయాలి. అలాగే కల్తీ ఆహారాన్ని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని, మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలి తెలిపారు.
మీ పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త  డోన్ 

 1,339 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.