September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్…

1 min read

AABNEWS : ఇంద్రవెల్లి :విద్యతోనే మనిషి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గిన్నేరా, బిక్కుతండా, ముత్నుర్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. బిక్కుతండా గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. గిన్నేరా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్ని సమస్యలు వచ్చినా చదువుకోసం అడుగు ముందుకేయాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మెరుగైన ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. కరోనా మహమ్మారి వైరస్ ప్రభావం ఉన్నందున ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ విధిగా మాస్క్‌లు ధరించాలని వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. మండల జెడ్పీటీసీ సభ్యురాలు ఆర్కా పుష్పలతా గ్రామ సమస్యలు విన్నవించగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కిషన్, డిఆర్డిఎ పిడి రాథోడ్ రాజేశ్వర్, మండల తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపిడివో పుష్పలతా, మండల ఎంపీపీ పోటె శోభాబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ ఆంజద్, మండల జెడ్పీటీసీ సభ్యురాలు ఆర్కా పుష్పలతా, మండల ఎంపీవో సంతోష్, ఉపాధి హామీ ఏపీవో జైస్వాల్ సంతోష్ లాల్, ఈసీ జాధవ్ శ్రీనివాస్, గ్రామాల సర్పంచులు అర్క పుల్లుబాయి, ఆడే విజయా, తుంరం బాగుబాయి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు

 848 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.