September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంజీ గ్రామంలో సామూహిక వివాహాలు…

1 min read

AABNEWS : అంజీ గ్రామంలో సామూహిక వివాహాలు

నూతన వధువరులను ఆశీర్వదించిన మహిళ కమీషన్ సభ్యురాలు, జడ్పి చైర్మెన్* ఆదిలాబాద్ (ఇంద్రవెల్లి) : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంజీ గ్రామంలో ఫులాజీ బాబా ద్యాన మందిరంలో సామూహిక వివాహాలు నిర్వహించారు.
తెలంగాణ మహరాష్ట్ర నుండి ఇరువురు మొత్తం 9 జంటలకు ఈ సామూహిక వివాహాల్లో పెళ్ళి నిర్వహించారు. ఈ సామూహిక వివాహాల్లో రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి, ఆదిలాబాద్ జడ్పి చైర్మెన్ రాథోడ్ జనార్థన్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మరియు మాజీ ఎంపి రాథోడ్ రమేష్ లు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఫులాజీ బాబా ఆశీస్సులతో సామూహిక వివాహాలను నిర్వహించి నిరుపేదలకు అండగా నిలవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి ఎంపిపి పోటే శోభా, జడ్పిటిసి అర్క పుష్పలత , జడ్పి కో అప్షన్ సభ్యుడు అంజద్, అంజీ గ్రామ సర్పంచ్ గారుళే కుసుంబాయి- దశరథ్, పులాజీ బాబా పుత్రుడు పులాజీ బాబా ట్రస్ట్ సిద్ధేశ్వర్ సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్, ఆంద్ ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు కుడే కైలాష్ , జిల్లా అధ్యక్షుడు ముఖడే విష్ణు మరియు తెలంగాణ మహరాష్ట్ర ల నుండి వచ్చిన వారి బందువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి మరియు జడ్పి చైర్మెన్ రాథోడ్ జనార్థన్ , బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ లు మాట్లాడుతు
అంజీ గ్రామంలో పులాజి బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ సామూహిక వివాహలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయని, నేడు ఈ పులాజీ బాబా ద్యాన మందిరంలో తొమ్మిది జంటలకు ఒకేసారీ వివాహాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సామూహిక వివాహాల్లో మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రల నుండి వచ్చిన నూతన వధువరులు వారి బంధువులు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని ఫులాజీ బాబా ఆశీస్సులు ఎల్లప్పుడు వారి వెంట ఉంటాయని ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

 142 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.