AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి సహకరించాలి…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ (aabnews): అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రజలతో పాటు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పంజాబ్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్మిస్తున్న డివైడర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారులతో మాట్లాడారు. వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. డివైడర్ పనులు చేపట్టడం ఆనందంగా ఉందని కానీ ఈ మధ్య మధ్యలో డివైడర్ ల నుంచి ప్రజలు రాకపోకలు సాగించే ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పార్కింగ్ స్థలం చూపించే వరకు ద్విచక్ర వాహనదారులకు ఫైన్ వివరించకుండా పోలీసు అధికారులు సూచించారని కోరారు. ఎమ్మెల్యే వెంటనే డిఎస్పి తో మాట్లాడి పార్కింగ్ స్థలాలు చూపించే వరకు వాహనదారులపై పట్టణంలో జరిమానాలు విరించి వద్దని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని దీనికి ప్రజలు వ్యాపారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదిలోపు పట్టణంలో చేపట్టిన పనులను పూర్తి చేసి రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. వ్యాపార సమస్యలు కూడా పరిష్కరిస్తామని అన్నారు. అలాగే వ్యాపారులకు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

 124 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.