AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆటలతో పాటు. జీవితం లోను గెలవాలి…

1 min read

AABNEWS :ఆదిలాబాద్: ఆటలతో పాటు. జీవితం లోను గెలవాలి
గుంజలాలో జరిగిన క్రికెట్ పోటీలు ఫైనల్ వీక్షించి బహుమతులు ప్రదానం చేసిన జడ్పీ చెర్మెన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ మండలం గుంజాలలో క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి .నార్నూర్…మరియు తలమడుగు మండలం కోసాయి కి చెందిన క్రీడా కారుల మధ్య ఫైనల్స్ రసవత్తరంగా సాగగా .జడ్పీ చెర్మెన్ రాథోడ్ జనార్దన్ డీసీసీబీ చెర్మెన్ కాంబ్లీ నాందేవ్ పోటీ ముగిసే వరకు ఉండి వీక్షించారు. మొదటి బహుమతి తలమడుగు మండలం కోసాయి కి దక్కగా రెండవ బహుమతి నార్నూర్ క్రీడాకారులకు దక్కింది బహుమతులు అంద చేసిన అనంతరం జడ్పీ చెర్మెన్ మాట్లాడుతూ క్రీడల తో పాటు జీవితం లో కూడా గెలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 50 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని .ఈ ఉద్యోగాల్లో కూడా పోటీ ఉంటుంది .ఉద్యోగ పోటీలో ఉంటారు కూడా గెలుపొంది తమ జీవితాలను నిలుపుకోవాలని అన్నారు. గెలుపు ఓటములు సహజం ఆటలను స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకోవాలని అన్నారు… ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య మేనేజ్మెంట్ జిల్లా కమిటీ సభ్యులు మర్సకొల తిరుపతి . సి. ఐ రమణ మూర్తి , ఎస్ ఐ విజయ్ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ సుభాష్ స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.