ఆదిలాబాద్ ఐటిఐ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ నియామకం…
1 min read
AAB NEWS : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాలకు ఎట్టకేలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ గా టి. సుజాత బాధ్యతలు స్వీకరించారు. జనవరి నెలలో ప్రభుత్వం చేపట్టిన పదోన్నతుల పండగలో భాగంగా టెక్నీకల్ విభాగంలో ఆదిలాబాద్ ఐటీఐ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే సుజాత ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి నూతన ప్రిన్సిపల్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల చాలా కాలం FAC ప్రిన్సిపల్ తో నడవడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రిన్సిపల్ రావడంతో కళాశాల అభివృద్ధి చెందుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో TO రొడ్డ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ జాదవ్ స్వప్న, క్లర్క్ ప్రవజిత్, trs నాయకులు గోక భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
444 Total Views, 3 Views Today