AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు జీవో నెంబర్ 3 సాధన సమితి సభ్యుల వినతి…

1 min read

AABNEWS: ఆదిలాబాద్ : జీవో నెంబర్ 3 స్థానంలో జీవో నెంబర్ 24 ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రమోషన్ నియామకాలు గిరిజన అభ్యర్థులతో గిరిజన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు జీవో నెంబర్ 3 సాధన కమిటీ సభ్యులు వినతి పత్రం సమర్పించడం జరిగింది. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ ను కలిసి విన్నవించారు. ఇటీవల చేపట్టే ప్రమోషన్ లో ఏజెన్సీ, మైదాన ప్రాంతాల మెరిట్ లిస్టు వేరువేరుగా చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో 100% ప్రమోషన్ గిరిజనులకు ఇవ్వాలని కోరారు. దింతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరగా పరిష్కారం అయ్యేటట్టు, గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ కు మెమోరాండం సమర్పించిన వారిలో జీవో నెంబర్ 3 సాధన కమిటీ నాయకులు చవాన్ భారత్, ఆత్రం భుజంగరావు, రాథోడ్ గణేష్, జాదవ్ రవీందర్, బానోత్ రామారావు, రాథోడ్ సుధాకర్, జాదవ్ పవన్ లాల్ తదితరులు ఉన్నారు

 28 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.