ఆదిలాబాద్ లో సీఎం కప్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ …
1 min read
AABNEWS : సీఎం కేసీఆర్ జన్మదినంను పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ కప్ వాలిబాల్ పోటీలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రెమేందర్ ప్రారంభించారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఈ పోటీలకు జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్ తో కలిసి చైర్మన్ ముఖ్య అతిధిగా హాజరై క్రీడా కారులను పరిచయం చేసుకుని, జాగృతి జెండా ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. జాగృతి జెండా ఆవిష్కరణ చేసి వాలిబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు గోలి శంకర్, చెన్న సాయిక్రిష్ణ, శ్రీపాద కార్తీక్, జ్ణాణెష్వర్, ప్యాలెపు ప్రవీణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
579 Total Views, 2 Views Today