September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆదివాసీ గూడలో కాలినడకన విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే రామన్న…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రురల్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలం పటిడిలోని అసోద, బురఖి, పూన గూడ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నయని అరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఉన్న సమస్యలను తొందరలోనే పరిస్కరిస్తానాని హామీ ఇచ్చారు. పునాగుడాలో మిషన్ భగీరథ నీళ్లు వస్తానే పునాగుడాకు వాస్తనాని ఎప్పుడు చెప్పిన ఎమ్మెల్యే, ఇప్పుడు పునా గూడకు మిషన్ భగీరథ నీళ్లు రావడంతో మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జోగు రామన్న పున గూడాలో పర్యటించారు. అదేవిధంగా ఆదివాసీ గూడాలోని పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు అటవీ ప్రాంతాల్లో అధికారులతో కలిసి కాలినడకన వెళ్లి పరిస్థితులను పరిశిలించారు. అనంతరం ఆడివాసీలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ తేరాస ప్రభుత్వ హయాంలో ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. చిన్న చిన్న తాండలను గ్రామ పంచాయతీలుగా చేసి, సంక్షేమ పథకాలు, రోడ్లు-రవాణా మెరుగు పరచామని తెలిపారు. అటవీ భూములకు కూడా రైతు బంధు మరియు రైతు భీమా పథకాలు వర్తింప చేసి త్వరలోనే సీఎం కేసీఆర్ హామీ మేరకు పొడు భూముల సమస్యలు పరిష్కరించబడు తయని ఎమ్మెల్యే తెలిపారు.ఎమ్మెల్యే వెంట అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, మార్కెట్ చైర్మన్ ప్రహ్లాద్, మండల వైస్ ఎంపీపీ రమేష్, టిఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీష్, శుక్లాల్, గంగయ్య, కోడప సోనేరావు, అరె నరేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు

 293 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.