AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎత్తుకెళ్లిన ఏటీఎంలు పగలగొట్టి 30 లక్షల నగదు అపహరణ…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎం పగులగొట్టి నగదును దొంగలించడం టైమ్ వెస్ట్ అనుకున్నారో ఎం గాని, ఏకంగా ఏటియం యంత్రన్నే పట్టుకెళ్లిన ఘటన ఆదిలాబాద్ లో కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్ లో గల ఎస్.బి.ఐ ఎటిఎం మిషన్ ను శుక్రవారం తెల్లవారు జామున దొంగలు పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళి నా ఏటీఎం యంత్రాన్ని పట్టణ శివారులోని బట్టి సవర్గాం గ్రామ ప్రాంతంలో ఎటిఎం మిషన్ పగులగొట్టి అందులోని క్యాష్ బాక్స్ ను ద్వంసం చేసి అందులో ఉన్న సుమారు 30 లక్షల నగదును అపహరించుకుని పరారైయ్యారు. బట్టి సవర్గాం గ్రామ శివారులో పడివున్న ఏటీఎం మిషన్ విడిభాగలను విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఏటీఎం యంత్రాన్ని స్వాధీనం చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు.

 56 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.