AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ రూరల్ : ఫసల్ బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వాటా చెల్లిబిచడంలో విఫలమైన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అందులో బాగంగానే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యపల్ గూడ గ్రామంలో శనివారం రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, పార్టీ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నేతలంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా గండ్ర సుజాత, సాజిద్ ఖాన్ మాట్లాడుతూ రైతులకు రావాల్సిన ఫసల్ బీమా ప్రీమియం డబ్బులు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడంతో రైతులకు ఈ డబ్బులు రావడం లేదని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసల్ భీమా వాట చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యసం నర్సింగ్ రావు, సంజీవ్ రెడ్డి, కొండా గంగాధర్, రాహుల్, రూపేష్ రెడ్డి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

 311 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.