AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోట్లతో అభివృద్ధి పనులుఎమ్మెల్యే రామన్న…

1 min read

AAB News : ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టి.ఆర్.ఎస్ ప్రభుత్వ ఏడేళ్ల కాలంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 244 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45, 49 వార్డుల్లో కలువుకొని 48 లక్షలు పట్టణ ప్రగతి నిధులు, 10 లక్షలు మున్సిపల్ నిధులతో నిర్మించే భారీ మురికి కాలువ నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ… ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కనీవినీ ఎరుగని రీతిలో గత 7ఏళ్ళలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తాము చేపట్టే అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. పట్టణంలో నిర్మించే మురికి కాల్వలను పూర్తి చేసి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అటు ప్రజలు సైతం ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని రోగాలబారిన పడకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ లు బండారి సతీష్, వెనగంటి ప్రకాష్, ఇతర కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

 282 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.