AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గణిత యశస్వినీ – 2020 అవార్డుకి బైరి సతీష్ కుమార్ ఎంపిక…

1 min read

AABNEWS : గణిత యశస్వినీ – 2020 అవార్డుకి బైరి సతీష్ కుమార్ ఎంపిక…..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన బైరి సతీష్ కుమార్ “గణిత యశస్వినీ -2020 అవార్డు” కి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి బైరి సతీష్ కుమార్ ను మంగళవారం అభినందించారు. ప్రాథమిక తరగతి విద్యార్థులకు డిజిటల్ తరగతులను DD యాదగిరి ఛానల్ మరియు TSAT ఛానల్ లో బోధిస్తున్నారు. విద్యార్థులకు విన్నూత్న రీతిలో పాఠాలు భోదిస్తున్నారు. కరోనా కాలంలో గత సంవత్సరం వేసవిలో పాఠశాల విద్యార్థుల కొరకు 4వ తరగతి గణితం కృత్య పత్రాలు (వర్క్ షీట్స్ )ని తయారు చేశారు. వీరు తయారు చేసిన వర్క్ షీట్స్ ని SCERT (స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ) వెబ్సైటులో పొందుపరిచారు. ప్రతి సంవత్సరం గణితంలో విద్యార్థిని విద్యార్థులకు వినూత్న రీతిలో భోదన చేస్తూ, విశేషమైన కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు “అకాడమిక్ అచీవ్ మెంట్ అవార్డ్స్ అసోసియెషన్ “సంస్థ వారు ఈ అవార్డును ఇస్తారు. ఈ సంవత్సరం బైరి సతీష్ కుమార్ ఈ అవార్డుకి ఎంపిక అయ్యారు. బైరి సతీష్ కుమార్ బోథ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ధన్నుర్ (బి ) పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదిన ఈ అవార్డును హైదరాబాద్ లో ప్రదానం చేస్తారు. గణిత యశస్వినీ అవార్డుకి ఎంపిక కావడం పట్ల ఆయనను ఉపాధ్యాయులు అభినందించారు.

 381 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.