గ్రామీణ బ్యాంక్ మంజూరు…
1 min read
AABNEWS : MD Amjad Khan Adilabad District Stafer : ఆదిలాబాద్ : గాదిగూడ మండలం లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మంజూరు అయింది. బ్యాంక్ బిల్డింగ్ మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ను కోరారు. సోమవారం కలెక్టర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, గాదిగూడ మండలం లోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు జడ్పీ చైర్మన్ తెలిపారు. జడ్పీ చైర్మన్ వెంట గాదిగుడ ఎంపీపీ చంద్రకళ రాజేశ్వర్,వైస్ ఎంపీపీ యోగేష్, గాదిగుడా సర్పంచ్ జైవంత్ రావ్,సర్పంచ్ దేవరావ్, ఉపసర్పంచ్ డిగాంబర్ తదితరులు ఉన్నారు.
41 Total Views, 2 Views Today