AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం…

1 min read

AABNEWS: ఆదిలాబాద్ జిల్లా// బోథ్ మండల కేంద్రంలోని షాధి ఖన లో 32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్బంగా బోథ్ మండల డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించిన AMVI K. హరింద్ర కుమార్ , ఈ కార్యక్రమంలో బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు, బోథ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బోథ్ CI మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు గా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని ఈ రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు ఒక లక్ష యాభై వేల వరకు చనిపోవడం జరుగుతుందని అంతే గాక 5 లక్షల వరకు గాయపడడం జరుగుతుందని రోజుకు 1300 వందల వరకు చనిపోవడం బాధాకరం ఉందని తెలంగాణా రాష్ట్ర లో 20 వేళా మంది వరకు చనిపోతున్నారని 20 వేల వరకు తీవ్ర గాయలపాలయ్యారుఅని ఈ రహదారి ప్రమాదాల బారినపడిన వారిపై ఆధారపడిన కుటుంబాలు ఏ ఆధారం లేక రోడ్డు పై అనాధాలై పోతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు డ్రైవర్లు ఒక సామాజిక బాధ్యతగా వాహనం నడియోఏ వారందరు గుర్తించాలి అని రహదారి భద్రతా నియమాలను సక్రమంగా పాటించడమే రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యమైన మార్గం .
అందు చేత వాహనాల యజమనులు,డ్రైవర్లు,విద్యార్థులు,ఉద్యోగస్తులు,మరియు ఇతర ప్రజానికం రహదారి భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని బైక్ మీద వెళ్లే వారు తప్పకుండా హెల్మెట్ ,లైసెన్స్, ఫిట్నెస్ తప్పకుండా కలిగి ఉండాలని మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని ఈ సంధర్బంగా తెలియజేసారు ఈ కార్యక్రమంలో బోథ్ మండలం లోని ఆటో , జీపు, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.

 59 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.