AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తలమడుగు మండలంలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం…

1 min read

AABNEWS : ఆదిలాబాద్: తలమడుగు : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని దహెగాం గ్రామానికి చెందిన ప్రేమజంట ఆత్మహత్య ప్రయత్నం చేసుకొన్నారు. వివరాల్లోకి వెళితే దహేగాం గ్రామానికి చెందిన ఒకే కులానికి చెందిన 25 ఏళ్ళ గోడం శ్రీరామ్, అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ళ గేడం సుజాత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను కుటుంబీకులు అంగీకరించకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబీకులు వెతుకులడగా ఎక్కడా కనిపించలేదు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఊరు బయట పంట పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడిన విషయాన్ని స్థానికులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. దింతో హుటాహుటిన కుటుంబీకులు అక్కడకు చేరుకోగా శ్రీరామ్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. సుజాత ప్రాణాపాయ స్థితిలో కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎస్.ఐ దివ్యభారతి ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఆదిలాబాద్ రిమ్స్ చికిత్స పొందుతూ ప్రియురాలి మరణం..

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేగామ్ లోని ఇరు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య యత్నాం చేసుకున్న ఘటనలో సంఘటన స్థలంలోనే ప్రియుడు శ్రీరామ్ మృతి చెందగా, తాజాగా రిమ్స్ లో చికిత్స పొందుతూ యువతి సుజాత సైతం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దేగామ్ గ్రామానికి చెందిన శ్రీరామ్, సుజాత లు గత కొన్ని నెలలుగా ప్రేమించుకొంటున్నారు. ఐతే కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో గ్రామ శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఘటనా స్థలంలో ప్రియుడు శ్రీరామ్ చనిపోగా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రియురాలు సుజాత సైతం దీంట్లో వీరి కుటుంబల్లోలో విషాదం నెలకొంది.

 767 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.