తైక్వాoడో క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి…
1 min read
AABNEWS : MD Amjad Khan SAdilabad District Stafer : ఆదిలాబాద్ : ఒలింపిక్ లో గుర్తింపు పొందిన క్రీడల్లో ఒకటైన తైక్వాoడో క్రీడల్లో రాణించేలా ఆదిలాబాద్ విద్యార్థులు ఉత్సాహాన్ని చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన తైక్వాoడో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తైక్వాoడో పలు విన్యాసాలను చేసి పలువురుని ఆకట్టు కున్నారు. ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులు ఎల్లో బెల్ట్ నుండి రెడ్ -1 బెల్ట్ వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉద్దేశించి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తైక్వాoడో క్రీడ అంటే ఆత్మరక్షణతో పాటు పలు విన్యాసాలను నేర్చుకొనే అవకాశం ఉంటుందని అన్నారు. ఇందులో బ్లూ, రెడ్, ఎల్లో, బ్లాక్ లాంటి పలు బెల్ట్ గ్రేడింగ్ లు ఉంటాయని తెలిపారు. ఒలంపిక్ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడల్లో ఇది ఒకటని అందుచేతనే విద్యార్థులు ఈ క్రీడల పట్ల ఉత్సాహం చూపించలన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోర్ట్ జూనియర్ అసిస్టెంట్ రాజు, అడ్వకేట్ సుధీర్, తైక్వాoడో జిల్లా అధ్యక్షులు అన్నారపు విరేశ్, ఇన్స్పెక్టర్స్ విజయ్ కుమార్, మాధవి, సెల్ఫ్ డిఫెన్స్ ట్రెనర్ అనిత రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
20 Total Views, 2 Views Today