AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యునిగా ఎంపీ సోయం బాపురావు నియామకం..

1 min read

AABNEWS : దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యునిగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావును నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోయం బాపురావుకు అదనంగా కీలకమైన దక్షిణ మధ్య రైల్వే శాఖలో సలహా మండలి సభ్యునిగా నియమించడం పట్ల కేంద్ర రైల్వే శాఖకు ఎంపీ సోయం కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి డిప్యూటీ కార్యదర్శి అజయ్ కుమార్ జా ఉత్తర్వులు జారీ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే సమస్యలపై సలహాలు అభిప్రాయాలు ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే సమావేశాలకు హాజరు కావాలని ఈ సందర్భంగా కోరారు. ఆదివాసీ ఉద్యమ బిడ్డ… పార్లమెంటు సభ్యుడు సోయం బాబూరావును రైల్వే సలహా మండలి సభ్యుడిగా నియమించడం పట్ల బిజెపి శ్రేణులు, తుడుం దెబ్బ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

 301 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.