దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని…
1 min read
AABNEWS : సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం జిల్లా ఏజెన్సీ మండలాల దళితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం తో పాటు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్,ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, ఏఐసీసీ సభ్యురాలు సుజాత , జడ్పీటీసీలు చారులత రాథోడ్, గోక గణేష్ రెడ్డి, మునిగెల నర్సింగ్ ,భరత్ చౌహన్,నగేష్,రాహుల్,మోసిన్ పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్సీ కార్యాలయము ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు…..
అనంతరం ఎస్సీ కార్పొరేషన్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు
519 Total Views, 4 Views Today