September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ద్మశాలీల ఎదుగుదలను చూడలేకే పార్టీ నుండి సస్పెండ్ చేశారు…

1 min read

AABNEWS : పద్మశాలీల ఎదుగుదలను చూడలేకే పార్టీ నుండి సస్పెండ్ చేశారు
అకారణ సస్పెండ్ పై సీఎం కేసీఆర్ ను సైతం కలిసి విన్నవిస్త పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆశమ్మ. ఆదిలాబాద్ జిల్లాలో పద్మశాలీలు రాజకీయంగా ఎదుగుతున్నరని, కులస్తుల అభివృద్ధి కోసం తాను చేపడుతున్న కార్యక్రమాలను చూడలేకనే పద్మశాలీలపై ఉన్న అక్కసుతోనే తనను టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే జోగు రామన్న బహిష్కరించరని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో బుధవారం పద్మశాలి కులస్తులతో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశమ్మ మాట్లాడుతూ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి బలమైన కారణం ఏదీ లేదని, ఒక్క మాట కూడా తనను అడగకుండానే సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదని ఎమ్మెలే కన్నీరు పెట్టుకున్నరని, తనకు కులబందవుల మద్దత్తు ఉందని కన్నీరు పెట్టుకునే అవసరం లేదన్నారు. ఆదిలాబాద్ కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ను నిండు సభలో కలిసి పద్మశాలి కులస్తుల సమస్యలను వివరించామని, టెక్స్ టైల్ పార్క్ కోసం అడిగానని గుర్తు చేసాయి. అప్పుడు కూడా తనను ఎమ్మెల్యే ఓర్వలేక పోయారన్నారు.
గుర్తు చేసాయి. ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం తనను హైదరాబాద్ కు తీసుకురావాలని ఎమ్మెల్యేకు చెప్పినప్పటికీ వందల సార్లు అడిగినా సీఎంని కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను trs పార్టీకి ఎన్నడు వ్యతిరేకంగా పోలేదని, పోవాల్సిన పరిస్థితి కూడా తనకు లేదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అంటే తనకు ఎంతో ఇష్టమని, తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం సీఎం కేసీఆర్ కు మద్దత్తుగా ఎన్నో ఉద్యమాలు చేపట్టమని గుర్తు చేశారు. తనకు పార్టీలో ఎలాంటి పోస్టులు లేకున్న పార్టీ కోసం ఒక కార్యకర్తగా పని చేశానని తెలిపారు. తన అకారణ సస్పెండ్ పై సీఎం కేసీఆర్ ను సైతం కలిసి విన్నవిస్తనని తెలిపారు

 506 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.