September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ సైకిల్ ఎడ్ల బండి ర్యాలీ…

1 min read

AAB News : ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరకుల ధరలను నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ నాయకులు సైకిల్, ఎడ్లబండ్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జనరల్ సెక్రటరీ మానవతా రాయ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాతల నేతృత్వంలో జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి అంబేడ్కర్ చౌక్ వరకు సోమవారం నాయకులు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ మేరకు మనవత్ రాయ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పటి వరకు 30 సార్లు డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే వెంటనే తగ్గించేది, కానీ ఈ ప్రభుత్వం ముప్పై సార్లు నిరసన తెలిపిన ప్రజల గోడును వినిపించుకోవడం లేదని అన్నారు. పెట్రోల్ 107 రూపాయలకు పెంచిందని ఆరోపించారు. ఎమ్మెల్యే జోగు రామన్న మీరు ఎందుకు ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదని, ఎందుకు కేసీఆర్ ప్రజల కోసం రోడ్డుపై పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, చారులత, నర్సయ్య, నాయకులు యసం నర్సింగ్ రావు, చరణ్ గౌడ్,
కార్యకర్తలు పాల్గొన్నారు.

 3,098 Total Views,  27 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.