నిజం సమాధి అవ్వకముందే ప్రతి ఒక్కరూ గొంతేతంది…
1 min read
AABNEWS : నిజం సమాధి అవ్వకముందే ప్రతి ఒక్కరూ గొంతేతంది -జార్జ్ రెడ్డి. ఉట్నూర్ అంబేద్కర్ చౌక్ నందు ఉస్మానియా యూనివర్సిటీ ముద్దు బిడ్డ జార్జ్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.74వ జయంతి సందర్బంగా విద్యార్థి నాయకుడిగా చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. విద్యార్థులు సమస్య పట్ల స్పందించి, జీన హై తో మర్నా సీఖో కదం కదం పర్ లడ్న సీఖో అంటూ విద్యార్థుల ను చైతన్య పరచడంమే కాకుండా సమాజపు అసమానతలు తొలగించడం లో జార్జ్ రెడ్డి కృషి మరువలేనిది, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయడం లో ముందుండే జార్జ్ రెడ్డిని మత వాద రౌడీ మూకలచే హత్య గావింబడటం జరిగిందని నేటి పరిస్థితులలో గ్రామ గ్రామాన జార్జ్ రెడ్డి లు కావాల్సిన అవసరం ఏర్పడింది, జార్జ్ రెడ్డి నేటి తరానికి ఒక ఆదర్శప్రాయం,చదువుతో పాటు సమాంతర ఉద్యమ పోరాటానికి విద్యార్థులు సిద్ధం కావాలని యంగ్ లీడర్స్ జేఏసీ ఫౌండర్ కాంబ్లే ప్రజ్ఞశీల్ పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో యంగ్ లీడర్స్ జేఏసీ జిల్లా ప్రెసిడెంట్ జాడి వెంకటేష్,మండల ప్రెసిడెంట్ కళ్యాణ్ రాథోడ్,వివేక్ ఆత్రం, జై జవాన్ జై కిసాన్ సంఘ ప్రెసిడెంట్,ఉపేంద్ర ఆత్రం, జాదవ్ బాలరాజ్, రాథోడ్ నవీన్ పాల్గొన్నారు
62 Total Views, 2 Views Today