AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిర్దేశించిన సమయంలోనే గూడ్స్ వాహనాలు పట్టణంలో అనుమతి-జిల్లా ఎస్పి ఎం. రాజేష్ చంద్రరాత్రి తొమ్మిది గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు సరుకులు రవాణా చేసే గూడ్స్ వాహనాలకు అనుమతి…

1 min read

AAB News: ఆదిలాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో సరుకులు రవాణా చేస్తున్న గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్లు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర, పేర్కొన్నారు, శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు, ప్రస్తుతం జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం లాక్ డౌన్ నిబంధనలు సైతం G Ms నంబర్ 102 తేదీ-11-05-2021 ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లు తెలిపారు, ఈ మేరకు ఇతర ప్రాంతాల నుండి సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల గూడ్స్ వాహనాలకు రేపటి నుండి రాత్రి తొమ్మిది గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మాత్రమే పట్టణంలో ప్రవేశం ఉంటుందని తెలిపారు, నిర్దేశించిన సమయంలోనే సరుకులను దిగుమతి, ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఉందని తెలిపారు,
మిగతా అత్యవసర సేవలైన ఆక్సిజన్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్, క్యారింగ్ వెహికల్స్, ఆక్సిజన్ యాంకర్స్ మెడికల్ పరికరాలు, నీళ్ల ట్యాంకర్లుకు లాక్ డౌన్ సమయంలో కూడా ఎల్లవేళల అనుమతి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు, నిత్యావసర సరుకులు తరలించే గూడ్స వాహన యజమానులు నిర్దేశించిన సమయాలను గుర్తించి సదరు వాహనాలను సమయాన్ని బట్టి పట్టణంలో ప్రవేశించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు,

 82 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.