AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలను నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ : పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలను నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు,కార్యక్రమం లో నాయకులు,కార్యకర్తలు ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు,ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ..దేశం లో పెరుగుతున్న పెట్రోల్ ధర లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని,అటు నిత్యావసరాల ధరలు కూడా ఆకాశనంటుతున్నాయని,బీజేపీ ప్రభుత్వం అధికారమే లోకి వస్తే 35 రూపాయలకు లీటర్ డీజిల్ వస్తుంది అని చెప్పిన రాందేవ్ బాబా ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలని అన్నారు.అనంతరం మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు,నియోజక వర్గ ఇంచార్జి గండ్రత్ సుజాత గారు,యాసం నర్సింగ రావు ,సంజీవ్ రెడ్డి,కొండ గంగాధర్ ,చరణ్ గౌడ్,మల్లేష్ యాదవ్,ఎం ఏ షకీల్,రాహుల్ చెంద్రాల, షేక్ కలీమ్,రాజు యాదవ్,శాంతన్ రావు,అర్ఫాత్,షిండే గారు,సంతోష్,అశోక్ అల్లాలి తదితరులు పాల్గొన్నారు.

 84 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.