పోలీసులకు పదోన్నతులు కల్పించే విధంగా కార్యాచరణ…
1 min read
AABNEWS : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు ప్రతినెల పదోన్నతులు కల్పించే విధంగా కార్యాచరణ -జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్,
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళకు ఏఎస్సై పదోన్నతులు,
ఉమ్మడి జిల్లా పోలీసులు మరింత ఉత్సాహంతో పని చేయడానికి ప్రతినెల పదోన్నతులు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు, సోమవారం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళకు ఏఎస్సై పదోన్నతి కల్పించి వారి భుజస్కంధాలపై జిల్లా ఎస్పీ పదోన్నతి చిహ్నం అలంకరించారు,1989 కానిస్టేబుల్ బ్యాచ్ మంచిర్యాల్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు
అమానుల్లా ఖాన్, ఎంఏ మాజిద్, లు ఉన్నారు, పదోన్నతి కల్పించిన అనంతరం నూతన పదవిలో విధులు నిర్వహించడానికి ఖాళీల అనుసారంగా జిల్లాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో ఎస్సై పదోన్నతులు కల్పించే ప్రక్రియలో భాగంగా సీనియర్ ఏఎస్సైలను ఎంపిక చేసి మూడు నెలల శిక్షణ కోసం హైదరాబాద్ పంపించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు, పదోన్నతులతో మరింత బాధ్యత పెంచుకొని బాధిత ప్రజలకు అండగా ఉండాలన్నారు, పదోన్నతులు కల్పించి పోలీస్ కుటుంబాల్లో ఆనందోత్సవాలు కలిగే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు, ప్రతి నెల ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఓఎస్ది ఎం. రాజేష్ చంద్ర, పోలీస్ కార్యాలయం ఏవో యూనుస్ అలి, సూపరిండెంట్ లు జోసెఫిన్, నయీమ్, సీనియర్ అసిస్టెంట్ జగదీష్, సిసి దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఎస్కె తాజుద్దీన్, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
72 Total Views, 2 Views Today