ప్రభూత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా కలిసికట్టుగా పనిచేయాలి…
1 min read
AABNEWS : స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈరోజు స్థాయి సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారి అధ్యక్షతన మాసాంతరము వరకు సాధించిన ప్రగతిపై సమీక్ష సమావేశం జరిగింది.గ్రామీణాభివృద్ధి కి సంబంధించిన వివిధ అంశాలపై , ప్రణాళిక మరియు ఆర్థిక పనుల స్థాయి,వ్యవసాయ స్థాయి,విద్య మరియు వైద్య సేవల స్థాయి,మహిళ సంక్షేమ స్థాయి,నిర్మాణపు పనుల స్థాయిపై మాసాంతము వరకు సాధించిన ప్రగతి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వంతో పని చేస్తూ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలందరికీ కీ చేర్చాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు,ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీ కిషన్ గారు,అదనపు కలెక్టర్ డేవిడ్ గారు, జిల్లా అధికారులు, జడ్పీ ఫోరం అధ్యక్షులు రాజు గారు తాంసి ,భీంపూర్ జడ్పీటీసీ సుధాకర్ గారు,ఇంద్రవెళ్లి జడ్పీటీసీ ఆర్క పుష్పలత గారు,గుడిహత్నూర్ జడ్పీటీసీ బ్రాహ్మనంద్ గారు,జైనాథ్ జడ్పీటీసీ అరుంధతి గారు, మవల జడ్పీటీసీ నల్ల వనిత గారు తదితరులు పాల్గొన్నారు.
25 Total Views, 2 Views Today