September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఫసల్ భీమా కోసం కాంగ్రెస్ ధర్నా…

1 min read

AABNEWS : MD Amjad Khan Adilabad District Stafer : ఫసల్ భీమా పరిహారం విడుదల చేయాలంటూ అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాలనధికారి కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది..ఈ కార్యక్రమం లో ఎంఎల్సీ జీవన్ రెడ్డి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదోంగల్లా వ్యవహరిస్తు రైతులను పీల్చుకతింటున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు రైతు ఫసల్ భీమా ప్రీమియం వాటాలను చెల్లించకుండా రైతులను మోసం చేస్తు పబ్బం గడుపుతున్నయని ఎంఎల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట రైతు ఫసల్ భీమా ప్రీమియం డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేస్తు కాంగ్రేస్ పార్టీ ధర్నా నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జీవన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే పాత చట్టాలను రద్దు చేసి రైతు ప్రయోజనాలను కోల్లగోట్టే కుట్ర చేయటంలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టానికి శ్రీకారం చుట్టిందని అన్నారు… ఈ యేడాది రాష్టంలోని రైతులు ఎన్నడు లేని విధంగా అకాల అతివ్రుష్టితో నష్టపోయిన ప్రభుత్వం కనీసం వివరాలు సేకరించే ప్రయత్నం కూడ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, కేసిఆర్ ఫాంహౌజ్ లో గుట్టలకోద్ది అక్రమ సంపాదన ఉందని అంటున్న బండి సంజయ్ వాటిని కోల్లగోట్టి బయటకు తీసే అధికారం మీ పార్టి చేతుల్లో ఉన్నా ఎందుకు ధైర్యం చేయట్లేదని ప్రశ్నించారు… ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి,కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ,ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ,జెడీపీటీసీలు గణేష్ రెడ్డి ,నర్సయ్య,సర్పంచులు,ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.

 104 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.