AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బి.జె.పి దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్నారన్న ఎమ్మెల్యే జోగురామన్న…

1 min read

AAB News : ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని ఘోరంగా విఫలమయ్యారన్న ఎమ్మెల్యే….
బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ళ పాలనలో కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయిందని, ప్రజా సంక్షేమం కోసం కేంద్రం చేసిందేమీ లేదని ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న గారు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన…కేంద్రం ఏడేళ్ళ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాలు కేవలం ప్రచారానికే పరిమితం చేశారని, కాంగ్రెస్ హయాంలో రక్షణ రంగంలో 41 శాతం ఉన్న విదేశీ పెట్టుబడులు 74 శాతానికి పెంచి… మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. దాదాపు నాలుగు లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీస్తామని నోట్ల రద్దు చేసినా ఫలితం శున్యమేనని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. ప్రచారానికి, ఎన్నికలపై సారించిన దృష్టి దేశ అభివృద్దివైపు పెట్టలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను అనేక మార్లు కేంద్ర మంత్రులు ప్రశంసించినా వాటికి నిధులు మంజూరు చేయడం లేదని, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించడం లేదని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరకుల ధరలను పెంచి సామాన్యుని జీవనాన్ని మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకేల్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల కంటే బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారని, రైతులను ఆదుకోవల్సింది పోయి.. వారికి మరింత ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతీ యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. నిరుద్యోగ శాతాన్ని రెండు నుండి ఎనిమిదికి పెంచారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంట నూనె ల ధరలను భారిగా పెంచి.. సామాన్యుని నడ్డి విరుస్తున్నారన్నారు. కరోనా రెండవ వేవ్ తీవ్రత గురించి నిపుణులు హెచ్చరించినా కేవలం ఎన్నికలపైనే దృష్టి సారించి, దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని పేర్కొన్నారు. అన్ని రంగాలను నాశనం చేస్తూ అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్నారని, బీజేపీ నాయకులకు అసలు అభివృద్ధి అంటే తెలుసా అని ఎద్దేవ చేశారు. ఎన్నికల ప్రచారంలో కేవలం జాతీయ వాదం, మత వాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు మనదేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉత్పత్తి అయిన వాక్సిన్ లను విదేశాలకు ఎగుమతి చేసి, దేశ ప్రజలకు వాక్సిన్ లేకుండా చేశారని అన్నారు. ఎన్నికలపై పూర్తి దృష్టిని కేంద్రీకరించి.. కరోనాపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ద్వారానే దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా పెరిగి అనేక మంది ప్రాణాలు విడిచారని, ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ తీరుపై అనేక మంది జాతీయ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సోదాహరణంగా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్, మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతుబంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బాని, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 420 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.