భీంసరిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పర్యటన…
1 min read
AABNEWS : ఆదిలాబాద్ రురల్ మండలం లోని భీంసరి గ్రామంలో ఈ నెల 9వ తేదీనసీఎల్పీ నేత మల్లు బట్టివిక్రమార్క బృందం రైతులతో ముఖాముఖీ కార్యక్రమానికి ప్రతి ఒక్క రైతు తప్పకుండా హాజరు కావాలని
ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం భీంసరి గ్రామంలో ముఖాముఖీ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాడుతూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, కొండ గంగాధర్, నగేష్, మల్లయ్య, సంజయ్, రామారావు, రాహుల్ చంద్రాల, రాజు యాదవ్, గజనన్, రవి, దేవేందర్, రూపేష్ రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
65 Total Views, 2 Views Today