September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​ బిజేపీలోకి …

1 min read

AABNEWS : ఆదిలాబాద్ ఉట్నూర్: సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు, మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​ బిజేపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. త్వరలో ముహుర్తం కూడా ఖరారు కానుంది. ఈ విషయం ఆయన స్వయంగా మిడియాకు వెల్లడించారు. ఇప్పటికే తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి బిజేపీలో చేరుతున్న విషయాన్ని కార్యకర్తలకు వివరించి వారి అభిష్టం మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టి నుంచి రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన రాథోడ్​ రమేశ్​ అంచేలంచేలుగా ఎదిగి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మెన్​, పార్లమెంట్​ సభ్యుడిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన టీఆర్​ఎస్​లో చేరారు. గత ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పార్టీ నుంచి ఖానాపూర్​ టికెట్​ ఆశించి భంగపడ్డారు. వెంటనే కాంగ్రెస్​లో చేరి ఖానాపూర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఓటమి చవిచుశారు. వెనువెంటనే వచ్చిన పార్లమెంట్​ ఎన్నికల్లోను ఆదిలాబాద్​ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైయ్యరు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్​కు దూరంగా ఉంటుంన్నారు. జిల్లాలో బిజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో బిజేపీలో చేరి తన సత్తా చాటాలని భావిస్తున్నా రాథోడ్​ రమేశ్​కు బిజేపీలో చేరేందుకు లైన్​ క్లీయరైంది. ఈ నెలాఖరులోగా ముహుర్తం ఖరారు చేసుకోని బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో పార్టీ కండువా ధరించనున్నారు. ఇది ఇలా ఉండగా ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుమన్​ రాథోడ్​ కూడా పతి వెంట బిజేపీ పార్టీలో చేరనున్నారు.

 234 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.