AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాస్కులు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్…

1 min read

AAB News: ఆదిలాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా డైట్ మైదానంలో గురువారం మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ పాల్గొని, సభ్యులతో కలిసి కూరగాయల విక్రయదారులకు, రైతులకు మరియు చిరు వ్యాపారులకు, ప్రజలకు సభ్యులు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్వయంగా అక్కడ ఉన్న వ్యాపారులతో మాట్లాడుతూ వారికి మాస్క్ యొక్క ఉపయోగం గురించి వివరించి, లాక్ డౌన్ నిబంధనలు అందరు పాటించాలని సూచించారు. ఈ మేరకు ప్యాట్రన్ వెంకటస్వామి మాట్లాడుతూ ఇదేవిధంగా భవిష్యత్తులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అదిలాబాద్ జిల్లా శాఖ ప్రజలకు కావాల్సిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ విజయబాబు, కోఆర్డినేటర్స్ అనిల్, ప్రమోద్, ప్రవీణ్, కిషన్ రావు, నరేష్, గణేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

 55 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.