AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రహదారి భద్రతే, జీవితానికి రక్షణ…

1 min read

AABNEWS : ఆదిలాబాద్:
రహదారి భద్రతే, జీవితానికి రక్షణగా ఉంటుంది – జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్,
32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా వాల్ పోస్టర్ విడుదల, 
ప్రమాద హెచ్చరికలను జాతీయ రహదారిపై వాహనదారులకు స్పష్టంగా కనబడే విధంగా అమర్చాలి,
జిల్లాలో హెల్మెట్ డ్రైవ్ మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు,
32 వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఆర్టిఓ అధికారులతో కలిసి రహదారి భద్రతకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ విడుదల చేశారు, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు పోలీస్, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా రోడ్డు భద్రతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు, ఇటీవలే ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనల అమలు చేస్తున్న నేపథ్యంలో పట్టణంలో మార్పు స్పష్టంగా కనబడుతుంది అని తెలిపారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలన్నారు, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చేవరకు నిరంతర కృషి చేయాలని అధికారులకు సూచించారు, అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంద అన్నారు, మనిషి ప్రాణం వెలకట్టలేని అత్యంత విలువైనదని, నిర్లక్ష్యం, అతివేగంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను అర్పించడం సరైంది కాదన్నారు, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందన్నారు, ద్విచక్రవాహనంపై ప్రయాణించేవారు బాధ్యతగా ఆలోచనతో హెల్మెట్ ధరించాలన్నారు, నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు, ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు, నెల రోజుల పాటు జిల్లా అంతటా అన్ని రహదారుల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు, ఈ కార్యక్రమంలో ఎంవిఐ డి శ్రీనివాస్, ఏఎంవిఐ రామారావు, బిక్షపతి, అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.

 271 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.