AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్ర సేవా పథకం అవార్డు గ్రహీతలకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు…

1 min read

AABNEWS :ఆదిలాబాద్: విధినిర్వహణలో రాణించిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుంది,
నకిలీ విత్తనాల సమాచారం అందించిన పోలీసులకు సేవా పథకాల కోసం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక,
జిల్లా పోలీసులకు రాష్ట్ర సేవా పథకాలు పొందడానికి సువర్ణ అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు, గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సేవా పథకాలు వరించిన ఇద్దరు ఎస్సైలను ఘనంగా సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ పథకాలను అలంకరించారు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మూడు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించిన ఎస్సై షేక్ అబ్దుల్ బాకీ రాష్ట్ర సేవా పథకంతో సన్మానం పొందారు, సాయుధ విభాగంలో ఎస్సైగా సమర్థంగా విధులు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేసిన డి. వసంత్ కు సేవా పథకంను అలంకరించారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో లో జిల్లా నుండి ఐదుగురు పోలీసు అధికారులకు రాష్ట్ర ఉన్నత సేవా పథకాలు వరించాయి, జిల్లా పోలీసులకు సేవా పథకాలు గెలుచుకునే అవకాశం కల్పిస్తామని, చిత్తశుద్ధితో పనిచేసి స్వయం సమాచార సేకరణను పదును పెట్టుకొని నకిలీ విత్తనాల ముఠా సమాచారంను సేకరించాలన్నారు, సమాచారం అందించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు, జిల్లా పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగంలో పనిచేస్తున్న 800 మంది పోలీసులు నలువైపులా సమాచారంలో సేకరించే పనిలో ఉండాలన్నారు,రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదుగురు జిల్లా పోలీసులకు సేవా పథకాలు, షేక్ ఫరీద్, ఎస్ఐ ఇచ్చోడ, గిన్నెల సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ ఎన్ఐబి కార్యాలయం (ఉత్తమ సేవా పథకం)కల్లెం ఆదిలక్ష్మి, మహిళా హెడ్ కానిస్టేబుల్ డిసిఆర్బి అదిలాబాద్, మచ్చ అశోక్ కానిస్టేబుల్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్. కోవా రమేష్, కానిస్టేబుల్ జైనథ్ పోలీస్ స్టేషన్,లకు సేవ పథకాలు ప్రకటించారు, త్వరలో అవార్డు గ్రహీతలకు కేటగిరీల కింద రాష్ట్ర ఉత్తమ సేవా పథకం గ్రహీతకు 30 వేలు, రాష్ట్ర సేవా పథకం పొందినవారికి రూ. 20 వేల నగదు బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు, ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ జి. మల్లేష్, ఎస్పీ క్యాంపు కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్, కమ్యూనికేషన్ ఎస్ఐ వి. గంగాసాగర్. పోలీస్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ ఎస్సై అన్వర్ ఉల్ హక్ తదితరులు పాల్గొన్నారు.

 351 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.