AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులపై బ్యాంకు వారి దౌర్జన్యం నశించాలి…

1 min read

AABNEWS : ఆదిలాబాద్:ప్రభుత్వం జమచేసిన రైతుబంధు డబ్బులు డ్రా చేయకుండా బ్యాంకు వారు తమ అకౌంట్లను హోల్డ్ లో పెట్టడంపై ఇచ్చోడ మండలంలోని బాబ్జి పేట్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ టేకం లక్ష్మి మాట్లాడుతూ..బ్యాంకు వారు ధనికులకు వత్తాసు పలుకుతూ పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.పేద ప్రజలు బ్యాంకు వచ్చి అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని ధ్వజమెత్తారు.ప్రభుత్వము జమచేసిన రైతుబంధు డబ్బులు తీసుకోవడానికి వస్తే లోన్ రెన్యువల్ అంటూ పలు కారణాలు చెప్తూ అకౌంట్లను హోల్డ్ లో పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు.వెంటనే బ్యాంక్ వారు స్పందించి తమ అకౌంట్లను అన్ హోల్డ్ చేసి తమకు రైతుబంధు డబ్బులు ఇవ్వాలన్నారు.లేనియెడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండాల మోహన్
పటేల్ తలండ ఆనందరావు,ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు పేందుర్ ప్రకాష్,ప్రధాన కార్యదర్శి గుండాల రమేష్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 52 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.