September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతుల జీవితాల్లో వెలుగులు నింపెందుకే నూతన సాగు చట్టాలు…

1 min read

AABNEWS : రైతు అవగాహనా సదస్సు లో కిషన్ రెడ్డి కామెంట్స్ కేంద్ర మంత్రి గా మొదటి మారు ఆదిలాబాద్ కు వచ్చాను. గతంలో పలు సందర్భాల్లో ఇక్కడికొచ్చాను. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నేనిక్కడికొచ్చాను. పాత చట్టాల తో వ్యవసాయం భారం.. వ్యవసాయదారులకు ఎన్నో కష్టాలు.. యువ రైతులకు పెళ్ళిళ్ళకు ఇబ్బందులు.. గత ప్రభుత్వాలు రైతులకు కేవలం ప్రోత్సాహకాలతోనే సరిపెట్టాయి తప్ప వారి కష్టాల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు.గత 6 సంవత్సరాలుగా విద్యుత్ కోతల్లేని దేశం గా ఉంది. kcr జబ్బలు చరుచుకుంటున్నట్లు తెలంగాణా మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతల్లేవు. కేవలం తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా కొరతలేకుండా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గతంలో విదేశాలనుండో యూరియా రైతులకు చేరకుండా కెమికల్ పరిశ్రమలకు వెళ్ళేది..
దీన్ని నిలువరించేందుకే మోదీ ప్రభుత్వం వేప పూతతో యూరియా బ్లాక్ మార్కెట్ ను అడ్డుకున్నారు.. గతంలో 21వేల 933 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ఉండగా, దాన్ని మోదీ
1 లక్షా 34 వేల 399 కోట్ల కు పెంచారు. MSP ని పటిష్ఠంగా అమలుచేసేందుకు గట్టి చర్యలు కేంద్రం తీస్కుంటోంది. 70 సం. లు గా 1300/- గా ఉన్న ధాన్యం మద్దతు ధరను మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక 1800/- కు పెంచారు. పత్తి కి కేంద్రం ఇస్తున్న మద్దతుధర కారణంగా ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్ళు నిలిచిపోయాయి. ప్రగతి భవన్ లో కూర్చొని ప్రగల్భాలు పలకటం మానుకోవాలి. దేశవయాప్తంగా 2 కోట్లకు పైగా రైతుల భూసార పరీక్షలు కేంద్రం చేయించింది..
kcr ఎన్ని చేయించారో చెప్పాలి. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.. కేంద్రం నుండి 11 చిన్న,మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణంకోసం నిధులిచ్చింది.
ఇక్కడి ప్రభుత్వం వాటిని దారిమళ్ళించింది. ఫసల్ భీమా యోజన, ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు.. కేంద్రానికి ఎక్కడ మంచి పేరొస్తదో అని KCR భయం. రేషన్ కార్డుల పై రాష్ట్ర లోగో తో పాటు కేంద్ర ప్రభుత్వ లోగో ముద్రించాల్సివస్తుందనే రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. పంట రుణాలు, వ్యాపార రుణాలను కేంద్రం ఇస్తోంటే వాటి పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. పొదుపు సంఘాల కు గతంలో ఎన్నడూ లేని విధంగా 20 లక్షల వరకూ రుణాలిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో 60 శాతంగా వ్యవసాయదారులున్నప్పటికీ నికర ఆదాయం 15 శాతానికి మించి పెరగట్లేదు. దీన్ని పెంచే దిశగా ప్రధాని మోదీ చర్యలు తీసకుంటున్నారు. ప్రతి వస్తువుకూ దాని ఉత్పత్తి దారుడికే ధర నిర్ణయాధికారం ఉంది..
కానీ రైతుకు మాత్రమే ఆ ధర నిర్ణయాధికారం లేదు. ఇది బాధాకరం. ఇదివరకటి చట్టాలతో రైతులు తమ పంటలను అమ్ముకోవటానికి నిబంధనలు అడ్డుగా ఉండేవి.. ఆ బంధనాల తొలగింపే నూతన రైతు చట్టాల సారాంశం. KCR వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పంటలను కార్పోరేట్ సంస్థలకు అమ్ముకుంటున్నాడు.. ఎకరానికి కోటి రూ.లు kcr మాత్రమే సంపాదిస్తున్నాడు.. మిగతా రైతులు మాత్రం ఆర్థిక నష్టాల్లోకి. రాష్ట్రం లోని రైతుల్నిమాత్రం మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాలంటున్నాడు.. ప్రపంచంలో నే అత్యంత వ్యవసాయ యోగ్యమైన భూమి భారత్ లోనే, అత్యధిక వ్యవసాయ దారులున్నదికూడా భారత దేశమే.. కానీ గత పాలకుల కారణంగా అత్యధిక నష్టాలెదుర్కొంటున్న రైతులున్నదీ ఇక్కడే. రైతుల మద్దతుతోనే కేంద్రంలో BJP ప్రభుత్వమేర్పడిందని గర్వంగా చెపతున్నాను. రైతులు నూతన వ్యవసాయ చట్టాలను చదవమని కోరుతున్నాను.. విపక్షాల మాయలో చిక్కుకోవద్దు.. ఒకవేళ ఏమైనా సమస్యలుంటే వాటిని సవరించటానికి మా ప్రభుత్వం సిదంగా ఉంది.. నూతన చట్టాల ప్రకారం రైతులు కోర్టుకు వెళ్ళటానికి అవకాశం లేదనేది అబధ్ధం.. మేము ఏ పార్టీకీ భయపడము, కేవలం ప్రజలకు, రైతులకే మేము తల వంచుతాము. ఫాం హౌజ్ లో పడుకోవటానికి ప్రభుత్వంలోకి రాలేదు. ఏళ్ళుగా సెలవనేది లేకుండా పనిచేస్తున్న ప్రధాని పాలనలో మనమున్నామనేది ప్రజలు గుర్తించుకోవాలి. ఐదున్నర సంవత్సరాలుగా సెక్రెటేరియట్ కు రాని ముఖ్యమంత్రి kcr. వందలాదిమంది పబలిదానాలతో సాధించుకున్న తెలంగాణా నేడు ఓ కుటుంబపరమైంది. రైతులు, విధ్యార్థులు, కార్మికుల సమస్యలకంటే KCR కు ప్రధానమైన పనులేమున్నాయి. కల్వకుంట్ల, ఓవైసీ ఈ రెండుకుటుంబాలే తెలంగాణాను శాసిస్తున్నాయి. దుబ్బాక, GHMC ఎన్నికల్లో సంక్షేమ పథకాల పేరిట ప్రజలను trs వారు బెదిరింపులకు పాల్పడ్డారు.. ఐనప్పటికీ అక్కడ ఎలాంటి ఫలితాలొచ్చాయో అందరూ చూశారు. తెలంగాణా ప్రజలు మార్పుకోరుకుంటున్నారు. ఇది గత పార్లమెంట్ ఎన్నికలనుండి మొదలైంది..
రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు BJP కి ఆధిక్యత కట్టబెట్టడం ఖాయం. ప్రజాధనం విషయంలో అవినీతికి తావులేకుండా ప్రతి పైసా కు లెక్కచూపేలా జవాబుదారీగా ఉంది మా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో అది పూర్తి విరుధ్ధంగా ఉంది. ఆదిలాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. 2016 లో దీనికి కేంద్రం 130 కోట్లు మంజూరు చేసింది.. అందులో నుండి 60 కోట్లతో అత్యాధుని వైద్యపరికరాలనూ కొనుగోలు చేయటం జరిగింది. కానీ రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకూ 30 కౌట్ల రూ. ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్థలమిస్తే ఉడాన్ స్కీం కింద ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ మంజూరు చేయిస్తాను. పేద రైతులు కూడా విమానాల్లో ప్రయాణించాలనేదే మా కోరిక కరోనా కష్టకాలంలో ప్రజలను ఏమాత్రం పట్టించుకోని తెలంగాణా పాలకులు.

 136 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.