AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాం జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర…

1 min read

AAB News: ఆదిలాబాద్: స్పెషల్ డ్రైవ్ ద్వారా లాక్‌డౌన్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చర్యలు,అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో పటిష్టమైన బందోబస్తు,నిఘా వ్యవస్థ ద్వారా సమాచారం సేకరించి, ఆకస్మికంగా తనిఖీలు,
పట్టణంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ,లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన 182 ద్విచక్ర వాహనాలు,04 ఆటోలు,02 కార్లు స్వాధీనం,జిల్లా వ్యాప్తంగా పదమూడవ రోజు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా కొనసాగుతున్నది, అన్ని ప్రధాన కూడళ్ల వద్ద అదనంగా బందోబస్తు కోసం పోలీసులను మోహరించారు, జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్టమైన ప్రణాళిక ప్రకారం మూడు షిఫ్టుల్లో ఆరు వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయనిర్బంధంలో కొనసాగుతున్నారు, ఉదయం కచ్చితంగా పది గంటలలోపే వ్యాపార సముదాయాలు, దుకాణాలు, చిరువ్యాపారులు ఇళ్లకు చేరుకునే విధంగా పెట్రోలింగ్ వాహనాల్లో సైరన్ హెచ్చరిక మోగిస్తూ అప్రమత్తం చేస్తున్నారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ ఉద్ధృత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు స్వచ్ఛందంగా పాటించి పోలీసులకు సహకరించాలన్నారు, లాక్ డౌన్ సమయంలో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు అందుకు గల కారణాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు తెలియజేయాలన్నారు, తగిన సాక్ష్యాలను చూపాలని, లేదంటే వాహనం స్వాధీనం చేసుకొని వెనక్కి పంపుతారని తెలిపారు, అత్యవసర సేవల కొరకు వెళ్తున్నవారు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు, లాక్ డౌన్ ఆంక్షలు ప్రజల ఆరోగ్యం క్షేమం కోసమే అన్న, వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు, ప్రతి ఒక్కరూ కఠినంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, కరోనా మహమ్మారిని కూకటివేళ్లతో నశింప చేయాలన్నారు, జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, గ్రామాల్లో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు, ఇద్దరు సిఐలు ఎనిమిది మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా లాక్‌డౌన్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు, అదనపు ఎస్పీ పరిపాలన ఎస్. శ్రీనివాస్ రావు, ఏఆర్ అదనపు ఎస్పీ బి.వినోద్ కుమార్, డిఎస్పి ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, కె ఉమామహేశ్వరరావు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

 109 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.