AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రికి వెళ్లేందుకు ఉచిత ఆటో సర్వీస్ సాజిద్ ఖాన్

1 min read

AAB News :ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలు, మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డ్ ప్రజలు
లాక్ డౌన్ కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ తన ఏ.ఎస్.కే. ఫౌండేషన్ ద్వారా రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ఇందు కోసం గర్భిణీ స్త్రీలు, అత్యవసర వైద్యం అవసరం ఉన్నవారు మరియు మెడికల్ ల్యాబ్ టెస్ట్ ల కోసం వెళ్ళ లేని రోగుల కోసం ఆటోలను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో శుక్రవారం రవాణా కోసం ఏర్పాటు చేసిన ఆటోలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ముందుగా ప్రజలకు సేవ చేసే చేసేందుకు అనుమతిచ్చిన ఇంచార్జి ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటో రవాణా సదుపాయం లాక్ డౌన్ సమయం ముగిసిన తర్వాత అంటే ఉదయం పది గంటల నుంచి తిరిగి ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర సేవలకు అవసరమైన వారికి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సదుపాయాన్ని పొందటానికి 24 గంటలు పనిచేసే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి, ఉచిత ఆటో సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మొదట వన్ టౌన్ పరిధిలో 10 ఆటోలు, టూ టౌన్ పరిధిలో 10 ఆటలతో ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. గర్భిణి స్త్రీలు, అత్యవసర వైద్య సదుపాయాలు కావలసినవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చున్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఆటోలతో కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనా కల్లోల సమయంలో ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవడానికి వీలుగా, వారికి తోడుగా ఉండేందుకు, వారికి ధైర్యాన్ని కల్పించేందుకు, వైద్య సేవలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఈ సదుపాయాన్ని ప్రజలకు అందిస్తున్నామని దీన్ని అవసరమున్నవారు 7386468941 నెంబర్ కి ఫోన్ చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నగేష్, మల్లేష్ యాదవ్, రాహుల్ చంద్రాల, రాజు యాదవ్, రసూల్ ఖాన్, గయాసొద్దీన్, షేక్ అబ్దుల్ అజిజ్ తదితరులు పాల్గొన్నారు.

 1,337 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.