వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం…
1 min read
AABNEWS : MD Amjad Khan Adilabad District Stafer :ఆదిలాబాద్ జిల్లాలో 2017 – 18 సంవత్సరంలో నాట్ కంపెనీకి చెందిన కింగ్ 101 రకం విత్తనాలు వేసిన రైతులకు విత్తనాల వల్ల కాతపూత ఉన్నపటికీ అనుకున్న దిగుబడి రాక నష్ట పోయరు. దీంతో అనాడు జిల్లా కలెక్టర్ కు విన్నవించగా సైంటిస్టులు క్షేత్రస్థాయిలో పరిశీలనజరిపి కింగ్ రకం విత్తనాలతో కాత పూత ఉన్న సరిగ్గా పంట దిగుబడి రాలేని విషయాన్ని నిర్ధారించారు.
జె.డి.ఏ ఆశా రాణి ఆధ్వర్యంలో నాట్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో సమావేశం నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 3 క్వింటాళ్ల చొప్పున ఒక్కొక్కరికి 15 వేల నష్టపరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 8, 500 ఎకరాల్లో…3,500 మంది రైతులు పంట నష్టం పోయినట్లు గుర్తించారు.
ఐతే నాట్ కంపెనీ కోర్టు నుండి స్టే తెచ్చుకుందని, మూడు నెలల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్టే లో పేర్కొంది. మూడు నెలల తర్వాత ప్రభుత్వం నుండి కోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి స్పందన లేదు.
22 Total Views, 2 Views Today