AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు…

1 min read

AAB News: ఆదిలాబాద్:లాక్ డౌన్ ఆంక్షలను ప్రణాళిక ప్రకారం సంబంధిత ప్రభుత్వ శాఖల సహకారంతో పదిహేనవ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది, బుధవారం జిల్లా ఎస్పీ ఉదయం 9-30 గంటల నుండి 10 గంటల వరకు పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాల వద్ద సైరన్ మోగిస్తూ సమయం దగ్గర పడుతుందని, అప్రమత్తం చేస్తూ 10 గంటల లోపు ప్రజలందరూ ఇంటికి చేరే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు,ఎప్పటికప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేస్తూ అన్ని ప్రధాన కూడళ్ల వద్ద బ్యారికేడ్లు ద్వారా దిగ్బంధం చేసి నిత్యం వినూత్న పద్ధతిలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు, పట్టణ శివార్లలోని కాలనీలో స్వయంగా క్షేత్రస్థాయిలో వెళ్లి బందోబస్తు అమలు తీరును పరిశీలించారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు పాటించడం తో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు, ప్రస్తుతం కరోనా టెస్ట్ చేసినవారిలో కేవలం 1.6 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఈ శుభపరిణామం జిల్లా ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు, ఉదయం 9:30 గంటల నుండి 10 గంటల వరకు అత్యంత కీలక సమయంఅని, ఈ సమయంలో ప్రజలందరూ ఒకేసారి ఇళ్లకు చేరుతుంటారని, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నారు, ఉదయం 10 గంటల తర్వాత నాన్ కాంటాక్ట్ ద్వారా ఫోటోలు తీసి వారిపై చలాన్లు విధిస్తున్నట్లు తెలిపారు, ఉద్యోగస్తులు దీనికి అనుగుణంగా పది గంటలకు ముందే తమ కార్యాలయాలకు చేరడం శ్రేయస్కరమని కోరుతున్నట్లు తెలిపారు, ప్రభుత్వ ఉద్యోగులు తమ శాఖ సంబంధిత ఐడి కార్డు/పాస్ విధిగా తమ తో తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు, లాక్ డౌన్ సమయంలో అనుమతుల కోసం ఇప్పటివరకు 4259 ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా,1983 దరఖాస్తుదారులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు,2276 మంది దరఖాస్తుదారులు సరైన పత్రాలు వెల్లడించక పోవడం వల్ల వారి పాస్ నిరోధించడం జరిగిందని తెలిపారు, విఫలం అయ్యారని తెలిపారు, ప్రస్తుతం ఏలాంటి దరఖాస్తులు పెండింగ్ లో లేవని వెల్లడించారు, వ్యవసాయదారులు సంబంధిత వ్యాపారులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా సంబంధిత DAO/మార్క్ ఫెడ్ అధికారులు జారీ చేసిన పాస్/పత్రాలతో రావాలని కోరుతున్నట్లు, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు, పట్టణ కాలనీలో పిల్లలు గుంపులుగా ఒకే చోట ఉండటం, కాలనీ రోడ్లపై తిరగడం, ఆటలాడుకోవడం శ్రేయస్కరం కాదని, వైరస్ ఒకరి నుండి మరొకరి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, ఈ అంశాలను గుర్తించి తల్లిదండ్రులు, సంరక్షకులు నివారించాలని కోరారు, లాక్ డౌన్ సమయంలో జిల్లా ప్రజలతో పోలీసుల సత్సంబంధాలు మరింత మెరుగు పడ్డాయిని, ఇలాగే ప్రజల సహకారం కొనసాగాలని కోరుతున్నట్లు తెలిపారు, క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు, ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుతీరును విశ్లేషించుకొని ప్రజలకు వార్తల ద్వారా అందించే బృహత్తర కార్యాన్ని చేపడుతున్న పాత్రికేయ మిత్రులకు అభినందనలు తెలిపారు, ప్రతి ఒక్కరి కృషి ఫలితమే నేడు విజయవంతమైన ఫలితాలు వెల్లడిఅవుతున్నాయని తెలిపారు, రానున్న రోజుల్లో ఇలాగే నిబంధనలు కొనసాగిస్తూ కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు, అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాస రావు, బి వినోద్ కుమార్, డిఎస్పిలు ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, కె. ఉమామహేశ్వరరావు, వీపూరి సురేష్, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 48 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.