AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సావిత్రిబాయి పూలే వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ Amjad Khan Staff Reporter : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రి బాయి పూలే వేషధారణలో చిన్నారులు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లు ఆదివారం సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి పలువురు బీసీ సంఘం నాయకులు, మాలీ కులస్తుల హాజరయ్యారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అటు చిన్నారులు సావిత్రి బాయి ఫులే విషధారణలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ మహిళలకు విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పూలే దంపతులు బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అనేక విధాలుగా కృషి చేశారని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వయంగా జ్యోతి బాఫులేను గురువుగా భావించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పార్థసారథి, ప్రమోద్ కుమార్ ఖత్రి, బండారి దేవన్న, సత్యనారాయణ, పలువురు మాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..

 166 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.