AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్లాపూర్ నాగోబా పుస్యమాస పూజల కోసం

1 min read

AABNEWS : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా పుస్యమాస పూజల కోసం మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు.
ఏడు రోజులపాటు ఏడు గ్రామాలు (ఎడ్లబండి) ఛకడ వాహనంతో ప్రచారం నిర్వహించి నిన్న సాయంత్రం ఎడ్లబండి ప్రచార రథం తిరిగి కెస్లాపూర్లోని మడావి పెద్ద ఇంటివద్ద చేరుకొని నేడు మెస్రం వంశీయులు పెద్దఎత్తున హాజరై మెస్రం వంశ పటేల్ మెస్రం వెంకట్ రావ్ ఆద్వర్యంలో నాగోబా ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర గంగాజలం కోసం కావలిసిన కలిశాన్ని తిసుకోని పూజలు నిర్వహించారు.అనంతరం మెస్రం వంశీయులు కలిశాన్ని కటోడ భుజంపై కర్రకు వేలాడదీసి నాగోబాకు మొక్కలు చెల్లించి కెస్లాపూర్ నుండి ఒకరినొకరు మెస్రం వంశీయులు కలుసుకొని ఏకరూప తెల్లని వస్త్రములు ధరించి కాలినడకన వరుసక్రమంలో పాదయాత్రగా హస్తలమడుగులోని పవిత్ర గంగాజలం కోసం కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు.ఈ మెస్రం వంశీయుల కాలినడకన పాదయాత్ర ఏడు రోజులపాటు కొనసాగి చివరి ఏడవ రోజున ఈ నెల 30 వ తేదీన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపంలోని గోదావరి నది లోగల హస్తలమడుగు వద్దకు చేరుకొని గంగమ్మకు పూజలు నిర్వహించి తమ వెంట తిసుకొచ్చిన కళిశములో పవిత్ర గంగాజలాన్ని సేకరించి అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్ మండలం గౌరి గ్రామంలోని కటోడ ఇంటివద్దకు చేరుకొని అక్కడ నుండి ఎక్కడి వారు అక్కడికీ వారి వారి ఇళ్ళకు బయలు దేరి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లపై బయలుదేరి మళ్ళీ ఈ పాదయాత్ర కొనసాగుతు ఫిబ్రవరి 7న ఇంద్రవెల్లి కి చేరుకోని ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి సాయంత్రం తిరిగి కెస్లాపూర్ గ్రామానికి చేరుకొని ఫిబ్రవరి 11న పుస్య అమావాస్య రోజు ఈ పవిత్ర గంగాజలంతో నాగోబా కు అభిషేకం చేసి మహాపూజ నిర్వహించనున్నారు.ఈ సారి కరోనా మహ్మారి కారణంగా జాతర ఉండదని భక్తులు కేవలం కొవిడ్ నిభందనలతో పూజలు నిర్వహించవచ్చని ఈ సందర్భంగా మెస్రం వంశ పటెల్ మెస్రం వెంకట్ రావ్ తెలిపారు.

 74 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.